పదాల మధ్యన నేను
నాలోకి కొన్ని వాక్యాలుగా ఇంకినపుడు మధ్యమంగా మరికొన్ని భావాల వెల్లువ
నరాలు పగిలేలా రుధిరపు హోరు గుండె గతుకుల్లో
అవి తట్టనపుడూనూ/నావికానపుడూనూ
మనసు సాంద్రత పెరిగి దళసరి ధూపమేదో నన్ను కాల్చుతుండగా కొత్త అర్థాలకు మూసపోస్తూ నా ఈదేహపు బట్టీ
నా కళ్ళలో పగిలిన పాలసంద్రాలన్నీ నాకు నేనె వడగొట్టుకుంటూ ద్రవీకరిస్తున్నా ఇప్పుడే...ఇక్కడే అమరణపు అంపసయ్య ఆలోచనలను
నేను మళ్ళా పుట్టడానికి ప్రయత్నిస్తుంటాను..ఆ పసితనపు పుప్పొడిని నా కాగితపు కూడలిలో కొద్ది కొద్దిగా అద్దేందుకు
ఇంకా ఏదో నిర్లిప్తత రాసి జీవించినా
రాయక మరణించినా
No comments:
Post a Comment