కొన్ని నిరీక్షణలు అంతే ఎప్పటికీ వసివాడవు
పాలపలుకుల తియ్యదనం ఇంకా ఇప్పుడు ఆర్ద్రంగానే ఉంది
ఎందుకో తెలియదు రెండక్షరాల ఇష్టాన్ని ఓ చేత్తో మోస్తూ అమ్మా అంటూ
ఇంకోవైపు తన మునివేళ్ళ ఖాళితనాన్ని ఎలా పూడ్చాలో తెలియని ఓ పసిచినుకు
ఆ శూన్యాన్ని అలా వదిలేసిన ఆ పదం కోసం నా(నుతూ)న్న కళ్ళలో ఎదురుచూపులను ఎలా నింపుకోవాలో నిజంగా ఇంకా తెలియనేలేదు
మొక్కలన్నీ పక్క పక్కగా
పూవులన్నీ వాటి కంటి దీపాలవడం చూస్తున్న అల్లరి నవ్వు పూయడం లేదు
పాకుతున్న ఆ తేనెపువ్వు ఎవరి వళ్ళో కేరింతలు కొట్టాలో అర్థం కాని బెంగ
ఆచ్ తీసుకుని వెళ్ళే చేతులు ఎప్పుడొస్తాయో అని కళ్ళను,కాళ్ళను ఎప్పుడూ ఇంటి గుమ్మం ముందర ఎత్తి చూసే చిట్టి హృదయం
ఆకాశాన్ని భుజాల మీదుగా చూపే ఉప్పుమూట అమ్మే అయినప్పుడు
చందమామ తేవడానికెళ్ళాడని నమ్మే ఆ వెండినవ్వు
ఇంకా ఆత్రంగా
ఆర్ద్రంగా తెలియని మనసు తడిలో వెక్కి వెక్కి యేడుస్తూనే
ఆచ్ తీసుకుని వెళ్ళే చేతులు ఎప్పుడొస్తాయో అని కళ్ళను,కాళ్ళను ఎప్పుడూ ఇంటి గుమ్మం ముందర ఎత్తి చూసే చిట్టి హృదయం. alaa eni rudayaalO! You made me cry inside. Can't show tears on the finger tips. Love you.
ReplyDeleteఆచ్ తీసుకుని వెళ్ళే చేతులు ఎప్పుడొస్తాయో అని కళ్ళను,కాళ్ళను ఎప్పుడూ ఇంటి గుమ్మం ముందర ఎత్తి చూసే చిట్టి హృదయం. alaa eni rudayaalO! You made me cry inside. Can't show tears on the finger tips. Love you.
ReplyDelete