Wednesday, July 30, 2014

ఒకేలా

పెద్ద ప్రమంచమేమి కాదు మన మధ్య కొంత దూరం అంతే
నువ్వకడా నేనిక్కడా నిలుచుంటాం చేతులు కలపడానికి
ఎప్పుడో గుర్తొచ్చిన్నపుడు చూసుకుంటాం మనసు తీరా మాట్లాడుకుంటాం
కొన్ని పూలు.... చెట్లు...మళ్ళా ఒక నవ్వు

కొంచం పొగమంచు
ఒకళ్ళకొకళ్ళం ముఖాలకి పులుముకుంటాం నచ్చితే
నువ్వు పైనా నేను కిందా

నిశ్శబ్దం
.
.
.
.
క్షణాలు కాలాన్ని కోస్తూ
ఒలికి పడే జ్ఞాపకాలు
ఇంకేముంది మనసు నిండా
........నడక కొంతసేపు

వినబడని గానం కళ్ళ మధ్యన
కలలు
ఆశలు
కన్నీళ్ళు
ఇంకో రోజు కలుద్దాం

ఖాళి
గుండె లోపల
నిర్లిప్తత
నిరీక్షణ
నిర్వచనం ....నీ గురించి

చినుకులు
ఆకుల చెప్పులు
తడిగా మెరుస్తూ
నీ నవ్వు
చాలు ...జీవితం

Monday, July 28, 2014

నేను



కాళ్ళ కింద బల్లపరుపు నీడ నన్ను మొస్తూ
అవగతమవని ఆలోచనా చితులు  చినుకుల గోళీలుగా 
తెప్పరిల్లిన చివరి చినుకు
భూమ్మీద బంగారు అణువు

కరెంటు తీగపై వరుసగా కూర్చుని కాళ్ళూపుతూ
నవ్వుతున్న కాకులు  నా కళ్ళతో స్నేహం 
మొదటి నుండి వీధిగుమ్మం దాకా 

నేను 
తడి పదార్థం 
పొడి రేణువు 
పచ్చని ఆత్మ 
సజీవ భస్మం 

తల బయట 
నేను లోపల ఇంకోలా 
పళ్ళ రెటీనా ఇంకొకళ్ళని తడుపుతూ 

నిత్యం 
ఒక ఆకలి
ఒక కేక 
ఒక దేహీ
బిగ్గరగా శరీరం 

కాటుక పెట్టుకున్న ఆకాశం 
నల్లగా సిగ్గుపడుతూ 
పసి పిల్లాడి కంట్లో నిద్దురవుతూ
ఉలికిపాటుకు అమ్మ చెమ్మ 

తేది మారింది 
రోజుగా
నెలగా
సంవత్సరంగా
నాలాగా

నేను
మంచం 
మత్స్యం
ఈదుతూ 
కలల్లో మునుగుతూ 
జీవితాన్ని కంటూ

ఇప్పుడు 
నా నీడ నాతోనే మళ్ళా 
కాలుతున్న చెక్కల పొగ అస్తమయం 

Sunday, July 27, 2014

నాతో పాటు


నీకు నాకు మధ్య ఏమిలేదు ఒక రాత్రి ఒక పగలు తప్ప
నువ్వు బయట నేను లోపల అంతే తేడా
గొళ్ళెంవేసిన గది తలుపుకు ఇవతల నేను అవతల నువ్వు ఒకరికొకరం సుపరిచితులమే కానీ ఏదో అర్థంలేని ఆంతర్యం
నాతోపాటే నువ్వూ నాలుగు మెతుకులు తింటావు అన్నింటికీ తలాడిస్తావు అచ్చూ నాలానే
పిట్రమాస్క్ లాంతరు వెలుగులో  మనిద్దరమే ఒంటరిగా నడుస్తూ ఉంటాం
అప్పుడు మన మధ్య చెప్పుకోడానికి పెద్దగా మాటలేమి ఉండవు ఎందుకంటే నీగురించి నాకూ నాగురించి నీకూ అన్నీ తెలుసుగా
ఇప్పుడొక నిశ్శబ్దం మాట్లాడుతుంది మళ్లి ఒకసారి

ముసురుపట్టిన ఆలోచనలు నీకు చెబుదామని అనుకుంటూనే ఉంటా కానీ నువ్వే వినవు ఎప్పుడూ
నా  నడక నాదే  నీ పరుగు నాదే ఇంకెక్కడ సమయం మిగిలింది చెప్పుకోడానికి
ఆఫీసుకు వెళ్ళేప్పుడో వచ్చేప్పుడో ఎదురుపడతావు చూసి నవ్వుతావు
ఆ ఒక్క క్షణం చాలదూ మన సంభాషణ పుర్తవ్వడానికి
వర్షం పడినప్పుడు ఏ వీధి చివరో పడుకుంటావు నేన్నికోసం ఇక్కడ ఎదురుచూస్తుంటే పగిలిన కళ్ళేసుకుని
భావాలు కొబ్బరాకుల వేళ్ళవుతాయి నువ్వు నన్ను పలుకరరించిన ప్రతిసారీ

మనిద్దరికీ అలవాటేగా ఊరిపొలిమేరల్లో తిరగడం
ఇంక బెరుకెందుకు రా పోయోద్దాం రాత్రంతా చక్కర్లు కొడుతూ కొన్ని అనుభావాలను మిగుల్చుకుందాం ఇద్దరం
ఇసుకలో గూళ్ళు కడుతూ నేనూ వాటిని తొవ్విపడేస్తూ నువ్వూ ఎన్నిమార్లు కట్టను
ఇక చాలు వచ్చేయ్ నా దగ్గరికి భుజాల మీదో మోకాళ్ళ మీదో ఆడుకుందూవుగానీ

నీకు నాకు మధ్య ఏమిలేదు తేడా నువ్వు మొరగడం నేను ఏడవడం తప్ప
శరీరం ఒక్కటే మనిద్దరిదీ    ......

Thursday, July 24, 2014

fucked off

మాటలన్నీ రైలు పట్టలా మీద ముగబోయినప్పుడు
పాలనవ్వులు చిద్రమైనప్పుడు నువ్వు స్పందిస్తావు
కళ్ళలో ప్రేమ తప్ప మరింకేమి లేని స్వచ్చమైన మొక్కలు ఇంకా పూర్తిగా ఎదగనే లేదు ఒక తప్పుడు వీర్యపు చుక్క ఫోను సంభాషణతో చిదిమేసింది
కాలమంతా తమదే అనే ఊహను తుడిచేసాడు
పసిపువ్వుల అరుపులు వినబడలేదు ఆ దరిద్రపు ఆత్మకి సమాధి అయ్యాడు ఒకపక్కగా
అయ్యో పాపం అంటావు ఈరోజు రేపు మళ్ళా కొత్త చావు షురూ
ఆశల దీపాలు ఇప్పుడు వెలుగుతున్నాయి ఆకాశంలో నక్షత్రాలై మనం మాత్రం అక్షరాలవుతాం
తిరిగోస్తామనేగా బయదేరింది మళ్ళి తిరగలేరని తెలియదనుకుంట పాపం రక్తాన్ని ముద్దాడారు
మన వ్యవస్థ గేట్లన్ని తెరిచే ఉంటాయి ఎప్పుడూ మృత్యుగుహలు కదా మరికొన్ని నిండు పిండాలని కలుపుకుపోవడానికి
ఎక్ష్గ్రేషియాలన్ని శవం మీద చిల్లరేగా ఏరుకో పనికోస్తాయి ఇంకోసారి
కాకపోతే ఇప్పుడు కాగితాలయ్యాయి కాలం మారిందిగా
సరే ఇక తల్లిదండ్రులంతా తయారవండి కార్పొరేట్ మందలోకి పిల్లలని మళ్ళా తోలడానికి
ఇది షరా మాములేగా మన సమయమెలాగో డబ్బులు లెక్కెట్టుకోవచ్చు ఎంచక్కా పోయేదేముంది కొన్ని ఆత్మలు రాలిపోతాయంతే

నిండు పతనం


నేను మరణిస్తూ ఉంటాను నన్ను నేను కోల్పోయిన ప్రతిసారి బహుశా ఇది నాకు కొత్తేమి కాదేమో
చిన్నప్పుడు బాల్యాన్ని కోల్పోయాక మిగిలిన ఒంటరితనంలో మొదటి మరణంతో కరచలనం  యవ్వనంలోకి అడుగులేస్తూ 
గుప్పెడు కన్నీళ్ళతో నన్ను తవ్వుకుంటూ డొల్లగా వ్యక్తపరచడం నాకంటే బాగా ఎవరికీ తెలియదేమో
ఎప్పుడూ ఒకేలా కనిపించే నక్షత్రాల రోదన నేను చూసిన క్షణాలు వర్షం పడినప్పుడల్లా

నా ఆలోచనలు చకోరాలైనప్పుడు వీచే కొండగాలిలో కొట్టుకుపోయే ఒంటరి పక్షి ఈకలా కళ్ళలో చిదిమిన గుడ్లను మళ్ళా కుట్లేస్తున్నప్పుడ్డల్లా పార్థివమవ్వాల్సిందే
బండరాళ్ళను ఒంటిమీద కప్పుకున్న మట్టిని నేనైనప్పుడు ఆనందంతో మనసు మరణం
చీకట్లో కొట్టుకుపోయే మిణుగురులు ఉదయంపూట కాలిన చిత్తుకాగితాలు నా ముఖంపై వాడిన పుట్టుమచ్చలు

ఇంకెన్నాళ్ళు మరణించాలో నన్ను కోల్పోకుండా ఉండడానికి

జంతు లోకం


అప్పుడే పుట్టిన మట్టి ఇంకా రూపం కూడా సంతరించని పసిమన్ను
రాక్షస వేళ్ళు కత్తులై శరీరంలో దిగబడినప్పుడు అర్థంకాని నిస్సహాయత
తెగిపడిన నెత్తుటి చుక్కలు భల్లాలై కొన్ని ఖండితాలను ఏర్పరచలేకపోయాయి
పాలనవ్వులు కొండపూలలా ఇంకా నవ్వనేలేదు మోహపు మొసళ్ళు జీవితాన్ని మింగేసాయి
పూర్తవ్వని నిర్మాణాన్ని పునాదుల్లోనే కూల్చేసిన కర్కసుడు
అంగాంగాలు తెగనరికే శక్తి కూడా ఇంకా ఆ కన్నీళ్ళకు లేదు
కనురెప్పలతో బోసిపళ్ళు పోయాల్సిన వయసును వయసుమళ్ళిన బైరవుడొకడు అనుభవించాడు
మనసు చిద్రమైన అవ్యక్తం ఆ నలుసు ఎక్కడ శాంతిన్చగలదు సిమెంటు డబ్బాలో తప్ప ఆఖరికి
ఆశల ఊహలను అప్పుడే అమ్మానాన్నల మధ్య కట్టుకుంటున్న ఓ చిన్ని ప్రాణం ఇప్పుడు నిద్రపోతోంది

Saturday, July 19, 2014

నేను సముద్రం


సముద్రమొక నిండు గర్భిణి
ప్రతి క్షణం కొన్ని కెరటాలను ప్రసవిస్తూనే మరుక్షణమే చూలమవుతూ
ఎప్పటికీ రమించని ఓ నిండు కన్య
వేల రహస్యాలను కడుపులో పోగేసుకుంటూ కంటున్న అమ్మ
సంతోషానికి దుఃఖానికి ఒకే రూపం
కన్నీళ్ళను స్రవించినా కర్పూరకాంతులను వెళ్ళగక్కినా అందమే
గెలవడం ఓడడం తనకు మాత్రమే తెలుసు
పడిలేవడం కొత్తేమి కాదు నింగినంటాల్సిన చేతులు తెగిపడిన మృతదేహాలు తనవే
ఎప్పటికప్పుడు అతికించుకుంటూనే తిరిగి తయారవుతుంది తనువు నిండని గబ్బిలంలా
ఎన్ని యదసీమలు పర్వతాలయ్యాయో కలుపుకున్న ప్రతిసారీ
కనుసొరంగంలో కనిపించని లవణం తను ఎప్పటికీ గాడత తగ్గని ఆకాశం
రాత్రులన్నీ కరగాల్సిందే గుంపుగా చచ్చిన జీవాలై
కడుపు నిండని ఆకలి యంత్రం

   

Wednesday, July 16, 2014

my rain


ఒకరోజు వర్షానికి ఇల్లు తడపాలనిపించినట్టుంది­
పైకప్పు సందుల్లోనుంచి కొన్ని చినుకులు రాలిపడుతున్నాయి కొబ్బరాకులు ఒళ్ళువిరుచుకోగా

అప్పటికే ఇంట్లో ఉన్న తపాళ నిండింది ఆ వానతో
పేడతో అలికిన నేల కావడంవల్లేమో ఓ రకమైన సువాసన
నులక మంచంపై కూర్చున్న నేను,నన్ను మోస్తున్న మంచం కోళ్ళు

సరే కాసేపలా బయట చూరు కింద నిండిన శూన్యాన్ని పలకరిద్దామని వెళ్ళాను
చూరులో రెండు వాసాల మధ్య కుక్కిన కొన్ని ముతక కాగితాలు
అవెంటో చూద్దామని నా చేతి మొదళ్ళు వాటిని అందుకున్నాయి
వాటిని విప్పిచూడగా కొన్ని వయసుమళ్ళిన అక్షరాలూను,అర్థమయ్యి­ కానట్టు పదబందాలు

తడిమి చూసుకున్నానో నన్నునేను
ఎప్పుడో నేను ఒలకబోసిన దస్తూరీనే అది
అప్పుడెప్పుడో రాసుకున్న కొన్నిజ్ఞాపకాలు,లోలో­పలే దాచుకున్న అనుభవాలూను

కొన్ని నిరంతర వాహినులేవొ నాలో ప్రవహిస్తున్నట్టుగా తోస్తోందీక్షణం
ఇప్పుడు మళ్ళా ఇంటిని ఆరబెట్టుకోవాలి తృప్తి నిండిన కళ్ళతో

వర్షం వెలిసింది ఇప్పుడే
ఇంక కొన్నాళ్ళు బ్రతకొచ్చు ఈ ముతకవాసనతో...

untitled


ఈ రోజు నా ఆత్మ నగ్నంగా కాలుతోంది నీ ఆలోచనల కొలిమిలో

ఇన్నాళ్ళు లోనెక్కడో చెదలుపట్టి తెరమరుగైన ఓ కణంలా దేహాన్ని కనిపించని మైనపు ముద్దలా తానారిపోయి వెలిగిస్తోంది

వేర్లు కనిపించని చెట్టు
దివిటీ అదృశ్యపు అగ్గి
ఎన్నిసార్లు పడుకుందో ఈ దేహం నిన్ను వీడి
నడిపించేదే నువ్వని తెలియక

ఆత్మ నగ్నత్వాన్ని చూడలేని శరీరమూ
క్షణికావేశపు అంధనిగూడంలో కొన్ని క్షణాలు

దేహాన్ని పొరలుపొరలుగా చీలుస్తూ కొన్ని నిశ్శబ్దాలు
వాటివెనక పురాతన జ్వలితాలు
ఎన్నిమార్లు కాలినా సరితూగని ఆత్మ సందేశంలా నేను.

Tuesday, July 15, 2014

కురిసే ఎండ


ఇప్పుడొక రాత్రి కావాలి చీకట్లో రాసుకోవడానికి
పగటి పలకపై దిద్దుకున్న కొన్ని ఆశలు నిశిగర్భంలో కుప్పపోయడానికి
వానకు రాలి కిందపడ్డ నలిగిన కొన్ని పువ్వులు ఇంటి గేటుకు అవతల నీళ్ళను మోస్తూ శ్రమించే ఆ మృదుత్వాన్ని తాకే కొన్ని చేతులు కావాలి
వానపాములను కళ్ళతో ముద్దాడే హృదయం ఒకటి చెక్కాలి
కప్పల సంగీతం పోసుకునే చెవులు మిణుకుమనాలి మళ్ళా ఒకసారి

పద వెడదాం మట్టిలో దొర్లే శరీరాలను వడపోసుకుతేవడానికి
పచ్చి మొక్కను కౌగిలించుకునే తడి మనసును తోడుకోవాలి నాలోంచి
ఎండుపూల పరిమళాలను దోసిళ్ళ సంచుల్లో ముటగట్టుకుపోవాలి
అరికాళ్ళు కాలే తెల్లటి ఎండ కురవాలి మధ్యాహ్నపు పొదుగులో

తాబేళ్ళను ఎత్తుకునే పెదవులు కావాలి నాచుఅందంలో
ఒళ్ళంతా పాకించుకునే ఆర్ద్రత తొణకాలి
ప్రతిసారి ఓ మబ్బు కదలాలి కరిగి దూకే చినుకుల కోసం
ఆకాశపు చెట్లు మొలవాలి ఇక్కడంతా మనల్ని మళ్ళీ పుట్టించడానికి



Sunday, July 13, 2014

సజీవినే


నేనింకా బ్రతికే ఉన్నాను నాలో గాలినీడల్లా
కొలిమిలో కాలుతున్న బొగ్గు కణికల్లా
ఎప్పుడో విసినికర్రతో బామ్మచేతుల్లో పుట్టిన నలుసు వాసన ఇంకా తడారలేదు
స్వేచ్చను గుండె కొప్పుల్లో నుండి విసిరేసేవరకు సజీవినే
నన్ను నేను బద్దకంగా తోసుకున్నపుడు వెన్నులో ధైర్యపు వెన్నెల పరుచుకోకపోదు
బజారు నిండా నా చూపులు నడిచినప్పుడు చేతులకు చెప్పులేసుకుని పరుగేట్టేన్తవరకు
కాలం ఒక ఇంద్రజాలం ప్రతిరోజూ వింతే
మరునాటికి రోతే మరిచిపోయినా గుర్తున్నా
తొలిచూలు నా ఆలోచన కడపాన్పు నా మరపు
వేకువే జననమయ్యాక సందెవేళకు ఇంత పున్నమిని పళ్ళెంలో కలుపుకుని మరణిస్తాను ఆణువణువూ నేనవుతూ  జీవిస్తాను
వానరాలు ఉయ్యాలలూగుతూ కనిపించే ఒకానొక అందమైన దృశ్యం కళ్ళలో పోసుకున్న  చంటోడిని
ప్రకృతిని మింగిన పెద్దోడిని పరాకాష్టకు అర్థం చెప్పే  ముసలోడిని
ఒంటికి గంటలు కట్టుకు తిరిగే నిశాచరాన్ని మింగేసాక సంపూర్ణమైన సరిహద్దుల్లో కణాన్ని చూసినప్పుడు మళ్ళా బ్రతికే ఉంటాను
ఇప్పుడింకా బ్రతికే ఉన్నాను నిర్జీవిగా

Friday, July 11, 2014

జ్ఞాపకాలు

ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను నీ గురించి ఏమైనా రాద్దామని కానీ మొదలుపెట్టేసరికే మర్చిపోతాను నిన్ను
అవును ఎప్పుడో చూసిన గుర్తు ఇప్పుడెలా జ్ఞాపకముంటుంది ...పక్కన కూర్చున్నపుడు నీ వెంట్రుకలు ఉయ్యాలలై ఊగుతుంటే వాటిపై నా కనురెప్పలు చూపులై వాలుతుంటాయి

హృదయపు వలయాలు గిరికీలు కొడుతూ నీ ముందు ఆగిన దృశ్యం ఇంకా గుర్తుచేసుకునే నిర్లిప్త రాత్రులు ఎన్నింటిని రాసినా గొంతు జీర తీరని దుఃఖంలా గుండె చెరువుల్లో సమాధి అయిన దాహం నువ్వు కనబడగానే
అశ్రు రేణువును మట్టితో జతకట్టే క్షణాలు కొన్ని సంతోషానికి నీటిఅర్థాలు వెతికే పనిలో ఇంకో నేను మాయమవుతూ వెనక్కు తీసుకెళ్ళే గుప్పెడు జ్ఞాపకాలు
మనసెందుకో పదేపదే నవ్వుతున్న బొమ్మల్లా అడవుల్లో జల్లని బురద ఒంటికంటినట్టు  దులుపుకోలేని దొంతర చిరునవ్వులు ఇవిగో ఇక్కడే నువ్వు మిగిల్చినవి
పోగేయనా పారేయనా చెప్పు బతుకు తిమిరంలో సేద తీర్చేవి ఇవేగా నువ్వున్నా లేకపోయినా

పూర్తిగా మరచిపోనూలేను వదిలెయ్యనూలేను  కొన్ని జ్ఞాపకాలను దాచుకోవడం తప్ప ఇంకొన్నాళ్ళు జీవించాల్సిన్దేగా ఒంటరిగానే శూన్యంలో అడుగులువేసుకుంటూ రథం కింద సైనికుడిలా కాక వీపువెనకాల మోస్తున్న తేనె మజిలీలు ఎప్పుడూ మనసు పుస్తకంలో గుర్తుచేస్తూనే ఉంటాయి నిన్ను తెరిచిమూసినప్పుడల్లా
తడియారని సంతకంలా....  

Tuesday, July 8, 2014

ఉదయించే రాత్రి


రెండు కాళ్ళ మధ్య దూరం ఎంతంటే ఏమని చెప్పను
అడుగు దగ్గర మొదలై ఆశల సముద్రం దాటేంత అని చెప్పనా
తప్పటడుగులు వేసిన దారులన్నీ ఒక్కసారిగా ఏదో జ్ఞాపకమొచ్చినట్టు 
గమ్యాలను  వెతుక్కుంటూ నిశాచరాలవుతాయి కలలుగా 

చప్పట్ల నడుమ దోస్తానా ఏంటంటే ఏమని చెప్పను 
పిలుపులకు ప్రాకారం కడుతూ వెన్ను తట్టే అణుబాంబులని చెప్పనా
ప్రోత్సహించే పచ్చని మొక్కలని చెప్పనా

పరిచయాల నడుమ బంధం ఏమంటే ఏమని చెప్పను
స్నేహపు వర్షంలో తడవడానికి కట్టుకున్న ఆకాశపు గూడని చెప్పనా
ఇరు మనసుల మధ్య చెలిమి ఎంతంటే
గ్రహాల భుజాల మీద చేతులేసుకుని తిరిగేంత అని చెప్పనా

చెట్లకు అడవికి ఉన్న అంతర్యం ఎన్ని యుగాలంటే ఏం చెప్పను
తల్లి కడుపులో పిండం అంత అని చెప్పనా 
తల్లడిల్లే వాత్సల్యం అని చెప్పనా 

పగటికి రాత్రికి మధ్య ఎన్ని మైళ్ళంటే ఏమని చెప్పను 
పూర్తికాని ఓ నిర్లిప్త రోజని చెప్పనా 
లేక తూర్పు నుండి పడమరకెళ్ళే  పావురాయని చెప్పనా

జననానికి మరణానికి అనుబంధం ఏంటంటే ఏమని చెప్పను
కళ్ళు మూసి తెరిచే కొన్ని దశాబ్దాలని చెప్పనా...

Saturday, July 5, 2014

ఒక సంభాషణ


దట్టమైన పొగమంచు కింద నా కాళ్ళు వేస్తున్న చిత్రాలు
ఘనీభవించి పగిలిన గుడ్డు పెంకుల్లా కళ్ళు
వేటినో చూడడానికి కష్టపడుతున్నాయి ఆ అరణ్యంలో

అమ్మ అయిన ఓ అడవి అప్పుడే ఒళ్ళు వంచి కూర్చుంది
చెట్టుగా మారి దాని ఒడిలో నీడను తాగుతూ నేను
శీతోష్ణాన్ని తట్టుకోలేక ముడుచుకున్న శరీరం

ఒరుసుకున్న చర్మం పొరలు పొరలుగా జుట్టు అల్లుకుంటూ
చేతులు చాపిన దృశ్యం
తాపలు విరిగిన భావనమొకటి కుప్పకూలిపోయే

ఒలికిన ఆ ప్రేమలో ప్రసవించిన కాంతులు
పచ్చని మేఘాలు దీపస్థంబాలై  అక్కడ కూలబడ్డపుడు
తెల్లగా మారిన రక్తంలో నిన్ను వెతుక్కుంటూ ఎవరో రావాలి

ప్రక్షాళనకు పనికిరాని మంచంకోళ్ళు నీ క్రింద
అది నువ్వేగా
గాఢత తగ్గిన చూపుల వేళ్ళు ఇంకెవరినో  ప్రతిబింబిస్తూ

వయసు మళ్ళిన నీళ్ళ చప్పుడు రాత్రిని సెలయేరుగా కోస్తూ
శిధిలమై ఉదయపు నీరెండను పలకరిస్తోంది
మరణానికి చాడీలు చెప్పే జననం ఆత్మగా మారి
నీలో చేరి కెలికిన జీవితం మిగిల్చిన గంధం

Friday, July 4, 2014

స్త్రీ

ఈ రోజు సముద్రాన్ని పలకరిద్దామని ఒక్కదాన్నే వెళ్ళాను నువ్వు లేకుండానే

తీరం ముందు పరుచుకున్న ఇసుకపై కూర్చున్నాను నీ గురించే ఆలోచిస్తూ
ఎన్నిసార్లు మనిద్దరం ఇక్కడ నడిచామో సాయంత్రాలు నిండుకునేదాక

కలల కెరటాలను కళ్ళలోకి తోడుకుంటూ యోచిస్తున్నా
ఈరోజు నువ్వు నన్ను ఒంటరిగా ఎందుకొదిలేసావొనని

నిన్ను నాలో(కం)లోకి ఎన్నిసార్లు పొదువుకున్నానో మర్చిపోయావా
నా ముఖం నీ చేతుల్లో
నేను నీలో
నువ్వు నాలో కరగడం ఇంకా గుర్తే

ఎన్ని క్షణాలను లెక్కెట్టను నువ్వు లేకుండా
గతాలను చెరపలేక
నీ జ్ఞాపకాలను ఇంకా మోస్తూనే ఉన్నా నువ్వు రావని తెలిసినా

అమ్మలా నిన్ను నేను హత్తుకున్నపుడు నా స్తన్యంలో నీ చేతివేళ్ళ గురుతులు ఇంకా అలానే ఉన్నాయి

ఇంకా ఎన్ని నిరీక్షణలు కరగాలో నాలో
నేనెప్పుడు అంతమవ్వాలో నీలో
వేచిచూస్తున్నా నువ్వొచ్చే గడియకోసం నా మదితలుపులు తెరచి
నిశ్శబ్దంగానే రోదిస్తున్నా
శూన్యం తోడురాగా.

Thursday, July 3, 2014

ఇంటి పెరడు


ఇంటి పెరట్లో కొన్ని మొక్కలు పలకరిస్తూ ఉదయం సాయంత్రం
వచ్చివెళ్ళేడప్పుడల్లా నవ్వుతూ తొలకరి పలకరింపు
పూల ఖజానాను మట్టి పొత్తిళ్ళలో అందంగా దాచుకుంటూ
కనబడతాయి

సూర్యుడి వాలు చూపులకు పడిలేస్తూ
మురిసిపోతుంటాయి
తలలు  వాల్చుతూ పసివాసనగొడుతూ
ఉయ్యాలలో చిగురిస్తాయి

నా చేతుల సహవాసం ప్రతిరోజూ కావాల్సిందే
కాసేపు కాక్పిట్లో  సంభాషించాల్సిందే
రా ఇటు వచ్చి చెప్పు అన్నట్టుగా వాటి కళ్ళు
రాత్రి ఎప్పటికో ఆడుతూ వెన్నెల్లో తడుస్తూ
కొన్ని నీళ్ళను మీద కుమ్మరించుకుంటాయి మంచులా

వయసు తెలియకుండా పెరిగాక కూడా సున్నితత్వం
ఒంటినిండా అలానే పులుముకుని కనిపిస్తూ
కొవ్వుత్తుల బాల్కనిలో నా హృదయాన్ని తగిలిస్తాను
క్షణాల శాంతికోసం మినుకుమంటూ

ఎవరో ఇప్పుడు వాటిని సమాధి చేసారు
వాడని పువ్వులు ఇప్పుడు నవ్వుతున్నాయి
మనసు స్పందించడం మానేసింది
పెరడు అలానే ఉంది స్మశానంలా

ఇంకా ఎన్నిసార్లు

కొన్ని కర్పూర కాంతులు కరిగిపోయాక
ఆశల ఆనవాళ్ళు చెదిరిపోయాక

నీలోని కొన్ని క్షణాలను నీకు నువ్వుగా అర్పణ చేస్తావు చూడు
గతించిన జ్ఞాపకాలు మనసు నిర్వేధంలో మరుగునపడిపోయాక

యతించినావు నీవు నాలో ఎన్నాళ్ళుగానో
మరచిపోలేని శ్వేత మయురంలా నన్ను అల్లుకున్నపుడు నీ యద రెక్కలపై తల వాల్చిన సమయాలను ఎలా పోగెయ్యను

ఇంకా ఎన్ని మార్లు నా ఆత్మ దహనమవ్వాలో నీ ఊహల ఖజానాలో.

Wednesday, July 2, 2014

స్పురిస్తూ నేను


ఇక నిన్ను ముగిద్దామని చూస్తుంటే అనంతమయ్యావు మనసు పొరల్లో

చెమ్మగిల్లిన దారులన్నీ నీ గురుతులే
ప్రకృతి అంతటా నీ వదన కుసుమాలే అల్లుకుపోయాయి

నీ ఊహల తరంగాలు మది దర్పణం గుండా ప్రసరిస్తున్నపుడు వక్రీభవించని నా చూపుల కోణాలను లెక్కించేదెలా

ఆరాధనో
ఆవేశమో

మోహమో
వ్యామోహమో
నిలువెల్లా కమ్ముకున్న ప్రేమ పొర

చలించే కాలంలో కొన్ని జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయి ఇంకా.

Tuesday, July 1, 2014

ఇంకొన్ని

కొన్ని క్షణాలు
కొన్ని గంటలు
కొన్ని పగళ్ళు
కొన్ని రాత్రులు
నిర్వచించలేని అనుభవాలను మిగులుస్తాయి

మళ్ళా ఇప్పుడు వాటిని వెనక్కి తోడుకుంటూ నూనె పాదాలతో ఒకసారి నడవాలి నాకు నేనుగా

దారపు పోగుల్లా సాలేగూడులో అల్లుకున్న మరికొన్ని జ్ఞాపకాలు
ఈరోజిక ముఖం కడుక్కోవాలి కొంచం కొత్తగా

కొన్ని భావోద్వేగాలతో రమిస్తూ నిన్ను మళ్ళీ కంటున్నాను నాలో నిశబ్దంగా

వేదంలా తోస్తావు కొన్ని క్షణాల్లో నాగురించి అన్నీ తెలిసినట్టు
ప్రతి నీ పేజీలో నా పేరును వెతుక్కుంటాను నువ్వు లేనప్పుడల్లా

ఇప్పుడు మళ్ళా కళ్ళలో ఇంకిపోయిన భీడు బావులేవొ మొలకెత్తుతున్నాయి
చాలా కాలం తరువాత కొత్త ఆశలకు పునాది.