కాళ్ళ కింద బల్లపరుపు నీడ నన్ను మొస్తూ
అవగతమవని ఆలోచనా చితులు చినుకుల గోళీలుగా
తెప్పరిల్లిన చివరి చినుకు
భూమ్మీద బంగారు అణువు
కరెంటు తీగపై వరుసగా కూర్చుని కాళ్ళూపుతూ
నవ్వుతున్న కాకులు నా కళ్ళతో స్నేహం
మొదటి నుండి వీధిగుమ్మం దాకా
నేను
తడి పదార్థం
పొడి రేణువు
పచ్చని ఆత్మ
సజీవ భస్మం
తల బయట
నేను లోపల ఇంకోలా
పళ్ళ రెటీనా ఇంకొకళ్ళని తడుపుతూ
నిత్యం
ఒక ఆకలి
ఒక కేక
ఒక దేహీ
బిగ్గరగా శరీరం
కాటుక పెట్టుకున్న ఆకాశం
నల్లగా సిగ్గుపడుతూ
పసి పిల్లాడి కంట్లో నిద్దురవుతూ
ఉలికిపాటుకు అమ్మ చెమ్మ
తేది మారింది
రోజుగా
నెలగా
సంవత్సరంగా
నాలాగా
నేను
మంచం
మత్స్యం
ఈదుతూ
కలల్లో మునుగుతూ
జీవితాన్ని కంటూ
ఇప్పుడు
నా నీడ నాతోనే మళ్ళా
కాలుతున్న చెక్కల పొగ అస్తమయం
No comments:
Post a Comment