Thursday, July 3, 2014

ఇంటి పెరడు


ఇంటి పెరట్లో కొన్ని మొక్కలు పలకరిస్తూ ఉదయం సాయంత్రం
వచ్చివెళ్ళేడప్పుడల్లా నవ్వుతూ తొలకరి పలకరింపు
పూల ఖజానాను మట్టి పొత్తిళ్ళలో అందంగా దాచుకుంటూ
కనబడతాయి

సూర్యుడి వాలు చూపులకు పడిలేస్తూ
మురిసిపోతుంటాయి
తలలు  వాల్చుతూ పసివాసనగొడుతూ
ఉయ్యాలలో చిగురిస్తాయి

నా చేతుల సహవాసం ప్రతిరోజూ కావాల్సిందే
కాసేపు కాక్పిట్లో  సంభాషించాల్సిందే
రా ఇటు వచ్చి చెప్పు అన్నట్టుగా వాటి కళ్ళు
రాత్రి ఎప్పటికో ఆడుతూ వెన్నెల్లో తడుస్తూ
కొన్ని నీళ్ళను మీద కుమ్మరించుకుంటాయి మంచులా

వయసు తెలియకుండా పెరిగాక కూడా సున్నితత్వం
ఒంటినిండా అలానే పులుముకుని కనిపిస్తూ
కొవ్వుత్తుల బాల్కనిలో నా హృదయాన్ని తగిలిస్తాను
క్షణాల శాంతికోసం మినుకుమంటూ

ఎవరో ఇప్పుడు వాటిని సమాధి చేసారు
వాడని పువ్వులు ఇప్పుడు నవ్వుతున్నాయి
మనసు స్పందించడం మానేసింది
పెరడు అలానే ఉంది స్మశానంలా

No comments:

Post a Comment