రెండు కాళ్ళ మధ్య దూరం ఎంతంటే ఏమని చెప్పను
అడుగు దగ్గర మొదలై ఆశల సముద్రం దాటేంత అని చెప్పనా
తప్పటడుగులు వేసిన దారులన్నీ ఒక్కసారిగా ఏదో జ్ఞాపకమొచ్చినట్టు
గమ్యాలను వెతుక్కుంటూ నిశాచరాలవుతాయి కలలుగా
చప్పట్ల నడుమ దోస్తానా ఏంటంటే ఏమని చెప్పను
పిలుపులకు ప్రాకారం కడుతూ వెన్ను తట్టే అణుబాంబులని చెప్పనా
ప్రోత్సహించే పచ్చని మొక్కలని చెప్పనా
పరిచయాల నడుమ బంధం ఏమంటే ఏమని చెప్పను
స్నేహపు వర్షంలో తడవడానికి కట్టుకున్న ఆకాశపు గూడని చెప్పనా
ఇరు మనసుల మధ్య చెలిమి ఎంతంటే
గ్రహాల భుజాల మీద చేతులేసుకుని తిరిగేంత అని చెప్పనా
చెట్లకు అడవికి ఉన్న అంతర్యం ఎన్ని యుగాలంటే ఏం చెప్పను
తల్లి కడుపులో పిండం అంత అని చెప్పనా
తల్లడిల్లే వాత్సల్యం అని చెప్పనా
పగటికి రాత్రికి మధ్య ఎన్ని మైళ్ళంటే ఏమని చెప్పను
పూర్తికాని ఓ నిర్లిప్త రోజని చెప్పనా
లేక తూర్పు నుండి పడమరకెళ్ళే పావురాయని చెప్పనా
జననానికి మరణానికి అనుబంధం ఏంటంటే ఏమని చెప్పను
కళ్ళు మూసి తెరిచే కొన్ని దశాబ్దాలని చెప్పనా...

Nice thilak gaaru:):)
ReplyDeletethanku కార్తీక్ గారు.
ReplyDelete