Friday, July 4, 2014

స్త్రీ

ఈ రోజు సముద్రాన్ని పలకరిద్దామని ఒక్కదాన్నే వెళ్ళాను నువ్వు లేకుండానే

తీరం ముందు పరుచుకున్న ఇసుకపై కూర్చున్నాను నీ గురించే ఆలోచిస్తూ
ఎన్నిసార్లు మనిద్దరం ఇక్కడ నడిచామో సాయంత్రాలు నిండుకునేదాక

కలల కెరటాలను కళ్ళలోకి తోడుకుంటూ యోచిస్తున్నా
ఈరోజు నువ్వు నన్ను ఒంటరిగా ఎందుకొదిలేసావొనని

నిన్ను నాలో(కం)లోకి ఎన్నిసార్లు పొదువుకున్నానో మర్చిపోయావా
నా ముఖం నీ చేతుల్లో
నేను నీలో
నువ్వు నాలో కరగడం ఇంకా గుర్తే

ఎన్ని క్షణాలను లెక్కెట్టను నువ్వు లేకుండా
గతాలను చెరపలేక
నీ జ్ఞాపకాలను ఇంకా మోస్తూనే ఉన్నా నువ్వు రావని తెలిసినా

అమ్మలా నిన్ను నేను హత్తుకున్నపుడు నా స్తన్యంలో నీ చేతివేళ్ళ గురుతులు ఇంకా అలానే ఉన్నాయి

ఇంకా ఎన్ని నిరీక్షణలు కరగాలో నాలో
నేనెప్పుడు అంతమవ్వాలో నీలో
వేచిచూస్తున్నా నువ్వొచ్చే గడియకోసం నా మదితలుపులు తెరచి
నిశ్శబ్దంగానే రోదిస్తున్నా
శూన్యం తోడురాగా.

No comments:

Post a Comment