Wednesday, July 16, 2014

untitled


ఈ రోజు నా ఆత్మ నగ్నంగా కాలుతోంది నీ ఆలోచనల కొలిమిలో

ఇన్నాళ్ళు లోనెక్కడో చెదలుపట్టి తెరమరుగైన ఓ కణంలా దేహాన్ని కనిపించని మైనపు ముద్దలా తానారిపోయి వెలిగిస్తోంది

వేర్లు కనిపించని చెట్టు
దివిటీ అదృశ్యపు అగ్గి
ఎన్నిసార్లు పడుకుందో ఈ దేహం నిన్ను వీడి
నడిపించేదే నువ్వని తెలియక

ఆత్మ నగ్నత్వాన్ని చూడలేని శరీరమూ
క్షణికావేశపు అంధనిగూడంలో కొన్ని క్షణాలు

దేహాన్ని పొరలుపొరలుగా చీలుస్తూ కొన్ని నిశ్శబ్దాలు
వాటివెనక పురాతన జ్వలితాలు
ఎన్నిమార్లు కాలినా సరితూగని ఆత్మ సందేశంలా నేను.

No comments:

Post a Comment