నీకు నాకు మధ్య ఏమిలేదు ఒక రాత్రి ఒక పగలు తప్ప
నువ్వు బయట నేను లోపల అంతే తేడా
గొళ్ళెంవేసిన గది తలుపుకు ఇవతల నేను అవతల నువ్వు ఒకరికొకరం సుపరిచితులమే కానీ ఏదో అర్థంలేని ఆంతర్యం
నాతోపాటే నువ్వూ నాలుగు మెతుకులు తింటావు అన్నింటికీ తలాడిస్తావు అచ్చూ నాలానే
పిట్రమాస్క్ లాంతరు వెలుగులో మనిద్దరమే ఒంటరిగా నడుస్తూ ఉంటాం
అప్పుడు మన మధ్య చెప్పుకోడానికి పెద్దగా మాటలేమి ఉండవు ఎందుకంటే నీగురించి నాకూ నాగురించి నీకూ అన్నీ తెలుసుగా
ఇప్పుడొక నిశ్శబ్దం మాట్లాడుతుంది మళ్లి ఒకసారి
ముసురుపట్టిన ఆలోచనలు నీకు చెబుదామని అనుకుంటూనే ఉంటా కానీ నువ్వే వినవు ఎప్పుడూ
నా నడక నాదే నీ పరుగు నాదే ఇంకెక్కడ సమయం మిగిలింది చెప్పుకోడానికి
ఆఫీసుకు వెళ్ళేప్పుడో వచ్చేప్పుడో ఎదురుపడతావు చూసి నవ్వుతావు
ఆ ఒక్క క్షణం చాలదూ మన సంభాషణ పుర్తవ్వడానికి
వర్షం పడినప్పుడు ఏ వీధి చివరో పడుకుంటావు నేన్నికోసం ఇక్కడ ఎదురుచూస్తుంటే పగిలిన కళ్ళేసుకుని
భావాలు కొబ్బరాకుల వేళ్ళవుతాయి నువ్వు నన్ను పలుకరరించిన ప్రతిసారీ
మనిద్దరికీ అలవాటేగా ఊరిపొలిమేరల్లో తిరగడం
ఇంక బెరుకెందుకు రా పోయోద్దాం రాత్రంతా చక్కర్లు కొడుతూ కొన్ని అనుభావాలను మిగుల్చుకుందాం ఇద్దరం
ఇసుకలో గూళ్ళు కడుతూ నేనూ వాటిని తొవ్విపడేస్తూ నువ్వూ ఎన్నిమార్లు కట్టను
ఇక చాలు వచ్చేయ్ నా దగ్గరికి భుజాల మీదో మోకాళ్ళ మీదో ఆడుకుందూవుగానీ
నీకు నాకు మధ్య ఏమిలేదు తేడా నువ్వు మొరగడం నేను ఏడవడం తప్ప
శరీరం ఒక్కటే మనిద్దరిదీ ......
No comments:
Post a Comment