Saturday, July 19, 2014

నేను సముద్రం


సముద్రమొక నిండు గర్భిణి
ప్రతి క్షణం కొన్ని కెరటాలను ప్రసవిస్తూనే మరుక్షణమే చూలమవుతూ
ఎప్పటికీ రమించని ఓ నిండు కన్య
వేల రహస్యాలను కడుపులో పోగేసుకుంటూ కంటున్న అమ్మ
సంతోషానికి దుఃఖానికి ఒకే రూపం
కన్నీళ్ళను స్రవించినా కర్పూరకాంతులను వెళ్ళగక్కినా అందమే
గెలవడం ఓడడం తనకు మాత్రమే తెలుసు
పడిలేవడం కొత్తేమి కాదు నింగినంటాల్సిన చేతులు తెగిపడిన మృతదేహాలు తనవే
ఎప్పటికప్పుడు అతికించుకుంటూనే తిరిగి తయారవుతుంది తనువు నిండని గబ్బిలంలా
ఎన్ని యదసీమలు పర్వతాలయ్యాయో కలుపుకున్న ప్రతిసారీ
కనుసొరంగంలో కనిపించని లవణం తను ఎప్పటికీ గాడత తగ్గని ఆకాశం
రాత్రులన్నీ కరగాల్సిందే గుంపుగా చచ్చిన జీవాలై
కడుపు నిండని ఆకలి యంత్రం

   

1 comment: