Friday, July 11, 2014

జ్ఞాపకాలు

ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను నీ గురించి ఏమైనా రాద్దామని కానీ మొదలుపెట్టేసరికే మర్చిపోతాను నిన్ను
అవును ఎప్పుడో చూసిన గుర్తు ఇప్పుడెలా జ్ఞాపకముంటుంది ...పక్కన కూర్చున్నపుడు నీ వెంట్రుకలు ఉయ్యాలలై ఊగుతుంటే వాటిపై నా కనురెప్పలు చూపులై వాలుతుంటాయి

హృదయపు వలయాలు గిరికీలు కొడుతూ నీ ముందు ఆగిన దృశ్యం ఇంకా గుర్తుచేసుకునే నిర్లిప్త రాత్రులు ఎన్నింటిని రాసినా గొంతు జీర తీరని దుఃఖంలా గుండె చెరువుల్లో సమాధి అయిన దాహం నువ్వు కనబడగానే
అశ్రు రేణువును మట్టితో జతకట్టే క్షణాలు కొన్ని సంతోషానికి నీటిఅర్థాలు వెతికే పనిలో ఇంకో నేను మాయమవుతూ వెనక్కు తీసుకెళ్ళే గుప్పెడు జ్ఞాపకాలు
మనసెందుకో పదేపదే నవ్వుతున్న బొమ్మల్లా అడవుల్లో జల్లని బురద ఒంటికంటినట్టు  దులుపుకోలేని దొంతర చిరునవ్వులు ఇవిగో ఇక్కడే నువ్వు మిగిల్చినవి
పోగేయనా పారేయనా చెప్పు బతుకు తిమిరంలో సేద తీర్చేవి ఇవేగా నువ్వున్నా లేకపోయినా

పూర్తిగా మరచిపోనూలేను వదిలెయ్యనూలేను  కొన్ని జ్ఞాపకాలను దాచుకోవడం తప్ప ఇంకొన్నాళ్ళు జీవించాల్సిన్దేగా ఒంటరిగానే శూన్యంలో అడుగులువేసుకుంటూ రథం కింద సైనికుడిలా కాక వీపువెనకాల మోస్తున్న తేనె మజిలీలు ఎప్పుడూ మనసు పుస్తకంలో గుర్తుచేస్తూనే ఉంటాయి నిన్ను తెరిచిమూసినప్పుడల్లా
తడియారని సంతకంలా....  

1 comment:

  1. గుర్తు ఉంటే జ్ఞాపకంగానే ఉంది పోతుంది ఎప్పుడు అండి బావుంది

    ReplyDelete