Thursday, July 24, 2014

జంతు లోకం


అప్పుడే పుట్టిన మట్టి ఇంకా రూపం కూడా సంతరించని పసిమన్ను
రాక్షస వేళ్ళు కత్తులై శరీరంలో దిగబడినప్పుడు అర్థంకాని నిస్సహాయత
తెగిపడిన నెత్తుటి చుక్కలు భల్లాలై కొన్ని ఖండితాలను ఏర్పరచలేకపోయాయి
పాలనవ్వులు కొండపూలలా ఇంకా నవ్వనేలేదు మోహపు మొసళ్ళు జీవితాన్ని మింగేసాయి
పూర్తవ్వని నిర్మాణాన్ని పునాదుల్లోనే కూల్చేసిన కర్కసుడు
అంగాంగాలు తెగనరికే శక్తి కూడా ఇంకా ఆ కన్నీళ్ళకు లేదు
కనురెప్పలతో బోసిపళ్ళు పోయాల్సిన వయసును వయసుమళ్ళిన బైరవుడొకడు అనుభవించాడు
మనసు చిద్రమైన అవ్యక్తం ఆ నలుసు ఎక్కడ శాంతిన్చగలదు సిమెంటు డబ్బాలో తప్ప ఆఖరికి
ఆశల ఊహలను అప్పుడే అమ్మానాన్నల మధ్య కట్టుకుంటున్న ఓ చిన్ని ప్రాణం ఇప్పుడు నిద్రపోతోంది

No comments:

Post a Comment