Thursday, July 24, 2014

నిండు పతనం


నేను మరణిస్తూ ఉంటాను నన్ను నేను కోల్పోయిన ప్రతిసారి బహుశా ఇది నాకు కొత్తేమి కాదేమో
చిన్నప్పుడు బాల్యాన్ని కోల్పోయాక మిగిలిన ఒంటరితనంలో మొదటి మరణంతో కరచలనం  యవ్వనంలోకి అడుగులేస్తూ 
గుప్పెడు కన్నీళ్ళతో నన్ను తవ్వుకుంటూ డొల్లగా వ్యక్తపరచడం నాకంటే బాగా ఎవరికీ తెలియదేమో
ఎప్పుడూ ఒకేలా కనిపించే నక్షత్రాల రోదన నేను చూసిన క్షణాలు వర్షం పడినప్పుడల్లా

నా ఆలోచనలు చకోరాలైనప్పుడు వీచే కొండగాలిలో కొట్టుకుపోయే ఒంటరి పక్షి ఈకలా కళ్ళలో చిదిమిన గుడ్లను మళ్ళా కుట్లేస్తున్నప్పుడ్డల్లా పార్థివమవ్వాల్సిందే
బండరాళ్ళను ఒంటిమీద కప్పుకున్న మట్టిని నేనైనప్పుడు ఆనందంతో మనసు మరణం
చీకట్లో కొట్టుకుపోయే మిణుగురులు ఉదయంపూట కాలిన చిత్తుకాగితాలు నా ముఖంపై వాడిన పుట్టుమచ్చలు

ఇంకెన్నాళ్ళు మరణించాలో నన్ను కోల్పోకుండా ఉండడానికి

No comments:

Post a Comment