వెన్నెలను మీద పోసుకున్న కెరటాలు నిత్యం తడుస్తూ
కొన్నివేలమార్లు పుడుతూ
నీటిలోకి దూకిన కాంతి బొంగరంలా ఎంతదూరం వెళ్ళిందో ఓ చూపు కొలుస్తూ
బస్సు కిటికీలోంచి నా కనురెప్పలు విడివడి బయటెక్కడో పడతాయి కొబ్బరాకులపై కూర్చుంటూ
తెగిపడిన నా ఆత్మలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఏరుకోలేనన్ని
ఏమో ఎన్ని కొండగోతుల్లో డొక్కలు పగిలాయో నిత్యపు మైనం కాల్చిన రక్తం నా అస్థిపంజరం గుండా
నన్ను తోస్తూ
క్షమిస్తూ
హింసిస్తూ
నిరాశా
విత్తనాలు ఎడారిపూల
సమాధుల కింద కప్పబడ్డాయి
No comments:
Post a Comment