The unpredictable only substance may view you sometimes...
Let them
Let it allow....Life goes and flows
కొన్నిసార్లు జీవించాలనిపించడం సహజమేనేమో ఏ ఆత్మకైనా
ఆత్మాభివృద్దికి కారణమైన విత్తనాలు జీవితంలో ఎక్కడో చోట తారసపడుతూనే ఉంటాయి
తనపై కూర్చుని విర్రవీగుతున్న కాండపు ఆకుల్లాగా
వేర్లు లోనెక్కడో దాక్కొని పైకిమాత్రం డాబుగా కనిపించే వృక్షం కూడా ఏదోక క్షణాన నేలకొరగాల్సిందేనేమో
జీవన పయనంలో కొన్ని మజిలీలు గురువులుగా నీ ప్రక్కగానే వెడలిపోతుంటాయి నువ్వు గుర్తుపట్టలేనంతగా
విజయమో
అపజయమో
నిబద్ధతను నేర్పిన చేతులు మళ్ళీ కనబడకుండా
ఎవరో ఒకరు చెప్పాలి మనకు ఆ ఆనవాళ్ళను నువ్వు కూడా చూశావని
అప్పటి వరకు దుమ్ము పట్టిన గత అనుభవాలన్నీ మరుగున పడుంటాయి
నీ వెనకెక్కడో నిలుచుని వీపును తడుముతుంటాయి నువ్వు ముందు నిలబడేందుకు
కాని స్వయంకృషి రక్తంపైన నరాల క్రింద దాచుకున్నట్టుగా ఒక నిషా
ఇప్పుడు అవే పాత కళ్ళు నీకెదురుగా అక్షరాలు దిద్దిస్తున్నాయి మళ్ళాఒకసారి
No comments:
Post a Comment