పచ్చని మొక్కలు కొన్ని నన్ను చూసి నవ్వినప్పుడు
ఆకాశపు హదయం మట్లాడినప్పుడు
ఇల్లంతా చెట్లై
ఒంటినిండా కొన్ని పూలు పూస్తాయి
అనుభవాల పొట్లం నా ముందు వడ్డించని విస్తరిగా
గుల్మొహర్ గబ్బిలాలు కళ్ళు తెరచి ఇంటివెనుక కాపు కాస్తుంటే
సముద్రపు నవ్వులు కురుస్తాయి
వాటిని దోసిలి బొక్కెనలో మోసుకుంటూ తీసుకెళ్ళా
స్వాతంత్రం పొందిన కుక్కలు నిన్ను ఆహ్వానిస్తుండగా
ఇటుకల గూటిలో పిచ్చుక విడిచిన వస్త్రాలను రెటీనాపై కప్పుకున్నా
ప్రకృతి చేతులు కెలికిన వర్ణచిత్రాలు జీవం పోసుకుంటాయి అమ్మానాన్నలుగా
పసిపాదాలు మిగులుతాయి ఒకానొక కుండీలో
రోజు గడిచింది సనాతనంగా
ప్రక్షాళణ చెందిన ఆత్మను కలిసాక
No comments:
Post a Comment