ఈరోజు ఆమె మళ్ళీ నవ్వింది నిశ్శబ్ధంగానే నాకు వినబడేలా
కళ్ళతోనే అచ్చులు పోసింది ఇక్కడంతా
రాతి గుహల్లో అట్టకట్టిన బూజులా నేను తననే చూస్తూ
ఈ మధ్య చాలా దూరం నడిచాను ఆమెతో తెగిపడిన ఊహలను అనుసరిస్తూ
తన చూపుల చెట్టు మొదళ్ళు నాలో దిగబడినప్పుడు స్వచ్చమైన ఊపిరితో ముఖం కడుక్కుంటాను మరోసారి
తన వక్ష సంద్రంలోకి నన్ను అదుముకున్నపుడు నాలో రేగే కోరికలకు ప్రతీకలా కొన్ని ప్రక్షాళనలు
మళ్ళా ఒక ప్రేమ తివాచీ మీదుగా ఇంకొన్నాళ్ళు నడవాలి ఆమెతో
దేహం కోసం కాదు కొంచం సహవాసాన్ని రాబట్టడానికి
తనలోని పచ్చదనం చూసినపుడు మళ్ళీ పుడతాను చాలాసార్లు కొంచం కొత్తగా తనతోపాటు సరళంగా
ఇప్పుడు వెతుక్కోవాలి ఓసారి ఆ నవ్వును నేను నిశ్శబ్ధంగా
No comments:
Post a Comment