చీకట్లో నవ్వే నక్షత్రాలు/
కొన్ని కలలు కరగాలి కళ్ళ నిచ్చెనల పైనుండి
తలపులన్నీ తపనలుగా మారి జీవించాలి
సజీవ సమాధులపై మరోసారి
నిర్జీవంగా నడవాలి
రెక్కలు విదిల్చిన ఆకాశం/
తడిసి ముద్దవుతున్న ధాత్రి
పగటి వెలుతుర్లు పడమరకెళ్ళాక
మబ్బుల మాటునుండి తనను బయటపెడుతున్న చందురుడు
అలుపెరుగనిరెక్కలు/
కొన్ని పక్షులు మళ్ళీ ఎగరాలి నింగి సరిహద్దులు దాటి
పడిలేచే కెరటాలే/
పదే పదే
సంద్రంలోనే తలదాచుకుంటూ
ఇప్పుడు ఇంకొన్ని కొత్త వస్తువులు కొ(క)నుక్కోవాలి ఏకాకిగానే
No comments:
Post a Comment